భైరవం తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.పరదా ప్రమోషన్స్ కి ఇక్కడికి వచ్చాను.మళ్లీ ఇప్పుడు కిష్కింధపురి ప్రమోషన్స్ తో రావడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడ ప్రేక్షకులు నాపై ఎంతగానో ప్రేమ చూపించారు.వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.నాకు చిన్నప్పటి నుంచి హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా ఒక యూనిక్ హారర్.డైరెక్టర్ కథ చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.కిష్కింధపురి తెలుగు బెస్ట్ హారర్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.మీ అంచనాలను అందుకుంటుంది అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























