అప్పడే హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన ఓజీ

OG Hits Half Million Milestone in No Time

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హైప్ రోజు రోజు పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. ఓవర్సీస్ లో అయితే ఈసినిమా ప్రకంపనలు సృష్టిస్తుంది. అక్కడ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. యూఎస్ఏ లో ఇప్పటివరకు హాఫ్ మిలియన్ ప్రీ సేల్స్ అయ్యాయి.దాంతో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఓపెన్ చేసిన షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి .ప్రీమియర్స్ తోనే 2 మిలియన్ మార్క్ ను దాటేలా కనిపిస్తుంది.అదే జరిగితే ఓజీ సరికొత్త రికార్డు నెల కొల్ప నుంది.యూఎస్ లో ఈ సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు సెప్టెంబర్ 2న ఈ టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.త్వరలోనే ఈ టీజర్ గురించి అధికారిక ప్రకటన రానుంది.

సుజీత్ డైరెక్షన్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ సరసన ప్రియాంక మెహన్ నటించగా అర్జున్ దాస్ ,శ్రీయా రెడ్డి , ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటించారు.తమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లలోకి రానుంది.ఈసినిమాతో పవన్ సాలిడ్ కం బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.