#90s వెబ్ సిరీస్ ఫేమ్ యూట్యూబర్ మౌళి హీరోగా నటించిన మొదటి సినిమా లిటిల్ హార్ట్స్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రీసెంట్ గా ఈసినిమా టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్సాన్స్ తెచ్చుకుంది.ఇక ట్రైలర్ కూడా విడుదలకానుంది. రేపు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రేక్షకుల ద్రుష్టి ఈ సినిమాపై పడాలంటే ట్రైలర్ కీలకం కానుంది.ఇక మొదట ఈసినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ చేయాలని భావించారు కానీ ఒక వారం ముందుకు జరిపారు.దాంతో సెప్టెంబర్ 5నే ఈసినిమా థియేటర్లలోకి రానుంది. అయితే అదే రోజు అనుష్క ఘాటి , శివ కార్తికేయన్ మదరాసి కూడా రిలీజ్ అవుతుండడం తో బాక్సాఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ కి భారీ పోటీ ఎదురుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాయి మార్తాండ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఫేమ్ శివాని నాగారం ఇందులో హీరోయిన్ గా నటించింది. #90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మించాడు.ఇక ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు.దాంతో థియేటర్ల ఇబ్బంది తప్పినట్లే.
లిటిల్ హార్ట్స్ లో కొత్త తరం నటీనటులు నటించారు.యూత్‌కు దగ్గరగా ఉండే లవ్ స్టోరీ, ఫ్యామిలీ టచ్ కలిపి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయని టీమ్ చెబుతోంది.ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అయితే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
td_block_video_youtube playlist_title=”” playlist_yt=”KN4-3-Qu1d8,ThCWWdSO6lo,qJiV296MUrk,U4eWQybZ1mg” playlist_auto_play=”0″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























