టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ ‘నవ దళపతి’ సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జటాధర’. ఇందులో సుధీర్ బాబు న్యూ అవతార్‌లో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ముఖ్యపాత్రను పోషిస్తోంది. వెంకట్ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి మరో కీలక పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ ఇందులో ‘శోభ’ అనే రోల్‌లో నటిస్తున్నట్టు తెలుపుతూ, దీనికి సంబంధించి ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. ఈ పోస్టర్‌లో శిల్పా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించింది. ఈ లుక్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచింది.
అయితే శిల్పా శిరోద్కర్ వంటి సీనియర్ నటి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం సినిమాకు ఒక కొత్త బలాన్ని చేకూర్చిందని చిత్ర బృందం పేర్కొంది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ లాంటి నటీనటులు ఈ సినిమాలో ఉండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామాగా, ప్రేక్షకులను సీట్లలో కదలకుండా చేస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇక ‘జటాధర’ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో చిత్ర బృందం వెల్లడిస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































