కొత్త లోక ట్రైలర్ రిలీజ్

Kotha Lokah Chapter One: Chandra trailer out now

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత నిర్మాణ సంస్థ వేఫారెర్ ఫిలిమ్స్ బ్యానర్ లో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 – చంద్ర.ఇందులో ప్రేమలు ఫేమ్ మలయాళ యంగ్ హీరో నస్లీన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తెలుగు లో కొత్త లోక గా విడుదలకానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది. మళయాలంలో ఈసినిమాకు మంచి హైప్ ఉండగా ఈనెల 28న విడుదలకానుంది.

 ఇక తెలుగు రాష్ట్రాల్లో టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈనెల 29న ఈసినిమాను రిలీజ్ చేస్తుంది.కొత్త లోక సినిమాకు  జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. ప్రస్తుతం తెలుగులో వేరే సినిమాతో పోటీ లేకపోవడ కొత్త లోక కు కలిసి రానుంది.మరి ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.