సెన్సార్ పూర్తిచేసుకున్న సుందరకాండ.. రిలీజ్‌కి రెడీ

Sundarakanda Censored With UA Certificate

నారా రోహిత్ హీరోగా నటించిన ‘సుందరకాండ’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో ఈ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. ఆగస్టు 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమాగా ‘సుందరకాండ’ ఉంటుందని సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా అర్థమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలకు సిద్ధం

‘సుందరకాండ’ సినిమా ఒక కుటుంబ కథా చిత్రంగా, మంచి భావోద్వేగాలతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. సినిమాలోని సన్నివేశాలు, కథనం, నటీనటుల నటనను సెన్సార్ బోర్డు సభ్యులు అభినందించారని సమాచారం. యూ/ఏ సర్టిఫికెట్ రావడంతో సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆమోదం లభించింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కలిసి ఈ సినిమాను చూడవచ్చని సెన్సార్ బోర్డు సూచించింది.

ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ కలయికగా..

ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి. సినిమా మంచి కామెడీ, డ్రామా మరియు రొమాంటిక్ అంశాలతో కూడి ఉంటుందని తెలుస్తోంది. నారా రోహిత్, శ్రీదేవి విజయ్‌కుమార్, విర్తి వాఘని వంటి నటీనటుల నటన సినిమాకు ప్రధాన బలం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. ఇక సెన్సార్ కూడా పూర్తవడంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షించేందుకు కోసం మూవీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.