యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం కపుల్ ఫ్రెండ్లీ.సంతోష్ శోభన్ ,మానస వారణాసి జంటగా నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో కపుల్ ఫ్రెండ్లీ అంచనాలు వున్నాయి.ఇక రీసెంట్ గా సినిమా టీజర్ రిలీజ్ కాగా ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాలో నేను అంటూ ఈసాగే పాట బాగుంది. ఆకట్టుకునే ట్యూన్, ఫీల్ గుడ్ లిరిక్స్, ఎనర్జిటిక్ వోకల్స్ ఈ సాంగ్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఈ పాటలోని లిరిక్స్ ఫ్రెష్‌గా, ట్రెండీగా ఉన్నాయి. ఈ సాంగ్ విజువల్‌గా కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తోంది.ఈసినిమాకు ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందిస్తుండగా అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.గణేష్ శివ ఎడిటింగ్, మైఖేల్ కళా దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.తెలుగు తోపాటు తమిళ్ లోకూడా రిలీజ్ కానుంది.
ఇక ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు సంతోష్ శోభన్. కెరీర్ లో ఓ సాలిడ్ హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు ఈ హీరో.మరి ఈ కపుల్ ఫ్రెండ్లీ తనకు కావాల్సిన విజయాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























