దసరా కాంబినేషన్ లో ది ప్యారడైజ్ వస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇందులో నాని ని సరికొత్త అవతారంలో చూపిస్తున్నాడు. రీసెంట్ గా ఈసినిమానుండి ఫస్ట్ లుక్ పోస్టర్ & మేకింగ్ వీడియో ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది . నాని ఈసినిమాలో జడల్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈసినిమా విడుదలకు చాలా రోజులే వున్నా అప్పుడే అవుట్ డోర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఫేమస్ ఏరియాల్లో జడల్ 3 డి పోస్టర్స్ తో కూడిన హోర్డింగ్స్ ను పెడుతున్నారు.ఇక ఆన్లైన్ లో ఈసినిమా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ హైప్ ఎక్కడా తగ్గుకుండా చూసుకుంటుంది ది ప్యారడైజ్ టీం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం 30శాతం కంప్లీట్ అయ్యింది.త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. దసరా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ కాంబో లో వస్తున్న ది ప్యారడైజ్ పై అంచనాలు భారీగా వున్నాయి.డిఫ్రెంట్ సబ్జెక్టు తో రా & రస్టిక్ గా తెరకెక్కుతుంది. ఈసినిమాలో నానిని చాలా వైలెంట్ గా చూపించనున్నాడు శ్రీకాంత్ ఓదెల.
ఇందులో కిల్ ఫేమ్ రాఘవ జ్యూయెల్ కీలక పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ ను ఫిక్స్ చేయాల్సివుంది.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.తెలుగు ,తమిళ, కన్నడ ,మలయాళం , హిందీ తోపాటు బెంగాలీ , ఇంగ్లీష్ ,స్పానిష్ భాషల్లో కూడా విడుదలకానుంది.ఇక రీసెంట్ గా హిట్ 3 తో వచ్చి వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్నాడు నాని.మరి ది ప్యారడైజ్ తో సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తాడో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























