బాలకృష్ణకు అరుదైన గౌరవం.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారానికి ఎంపిక

Nandamuri Balakrishna Honoured with Gold Edition Recognition by World Book of Records, UK

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ ఆయనకు ‘గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్’ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. తెలుగు సినీ పరిశ్రమలో తన అశేషమైన కృషి, సేవలకు గాను బాలయ్యకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందింది. కాగా ఇది తెలుగు సినిమాకు, నందమూరి అభిమానులకు ఒక గొప్ప గర్వకారణం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారతీయ సినిమాలో హీరోగా 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఈ గోల్డ్ ఎడిషన్ గుర్తింపుతో ఆయన సత్కరించబడ్డారు. ఈ పురస్కారం బాలకృష్ణ గారి ప్రజాదరణకు, నటుడిగా ఆయనకున్న గొప్పతనాన్ని చాటి చెబుతుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ.. “నన్ను ఇంతలా ప్రోత్సహించి, ఆదరిస్తున్న ప్రజలకు, అభిమానులకు ధన్యవాదాలు. ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ వంటి అంతర్జాతీయ సంస్థ నుండి ఈ గుర్తింపు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.” అని పేర్కొన్నారు.

ఇక ఈ ఘనత సాధించడం ద్వారా భారతీయ సినిమాలో ఈ అవార్డు అందుకుంటున్న మొట్టమొదటి నటుడిగా ఆయన రికార్డు సృష్టించారు. కాగా ఈ అరుదైన విజయాన్ని స్మరించుకునేందుకు ఆగస్టు 30న హైదరాబాద్‌లో బాలయ్య బాబుకి గొప్ప సత్కారం జరుగబోతోంది. ఈ కార్యక్రమంలో ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రతినిధులు, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.

ఇక ఇదిలావుంటే, మరోవైపు ఈ పురస్కారానికి ఎంపికైన తర్వాత బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇది బాలకృష్ణ గారి సినీ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా మిగిలిపోతుంది. ఈ గౌరవం ఆయన వ్యక్తిత్వానికి, అంకితభావానికి దక్కిన నిజమైన గుర్తింపు అని అందరూ ప్రశంసిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.