గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. సగానికి పైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇందులో రామ్ చరణ్ డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.త్వరలోనే సెకండ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇక ఈసినిమా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే వారంలో స్టార్ట్ కానుంది. మైసూర్ లో జరుగనున్న ఈషెడ్యూల్ లో హీరో హీరోయిన్ పై పాటను చిత్రీకరించనున్నారు.ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు ఈసినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ కాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.నవంబర్ లోపు షూటింగ్ అంతా పూర్తి చేయనున్నారు.ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.మార్చి 26న పెద్ది థియేటర్లోకి రానుంది.
అయితే అదే రోజున నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ కూడా రిలీజ్ కానుంది.శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నఆ సినిమాపై కూడా అంచనాలు భారీగా వున్నాయి.దాంతో బాక్సాఫీస్ వద్ద పెద్ది ,ది ప్యారడైజ్ మధ్య ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























