పరదాకి సురేష్ బాబు, రానా చాలా సజెషన్స్ ఇచ్చారు, అవి వర్కవుట్ అయ్యాయి

Paradha Will be a Fresh Attempt in Telugu Cinema - Producer Vijay Donkada

సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, మరో ప్రముఖ మలయాళీ నటి దర్శన రాజేంద్రన్‌, సీనియర్ నటి సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఆగస్ట్ 22న పరదా థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత విజయ్ డొంకాడ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పరదా కథని టేకాఫ్ చేయడానికి కారణం?

  • డైరెక్టర్ ప్రవీణ్ నాకు ‘సినిమా బండి’ నుంచి తెలుసు.
  • ఆనంద మీడియా బ్యానర్ పెట్టిన తర్వాత మేము దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాం.
  • కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు.
  • అయితే ఈ బ్యానర్‌లో తొలి సినిమాగా ఒక గుర్తుండిపోయే కథ చెప్పాలని భావించాము.
  • అప్పుడు ప్రవీణ్ ‘పరదా’ ఐడియా చెప్పారు. చాలా నచ్చింది.
  • తప్పకుండా ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
  • కమర్షియల్‌గా ఎంత చేస్తుందనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. కథగా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది.
  • తెలుగులో చాలా కొత్త అటెంప్ట్ అవుతుంది.

ఇది నిజంగా జరిగిన కథ?

  • కాదండి. పరదా ఫిక్షనల్ స్టోరీ. అయితే ఈ కథ మొదలవడానికి ఒక ట్రూ ఇన్స్పిరేషన్ ఉంది.
  • అయితే అది ఏంటి అనేది ఇప్పుడే రివీల్ చేయడం లేదు. మీరు సినిమాలో చూసినప్పుడు తెలుస్తుంది.

ఈ కథలో అనుపమ గారిని తీసుకోవాలని ఆలోచన ఎవరిది?

  • నేను, డైరెక్టర్ కలిసి తీసుకున్న నిర్ణయం.
  • ఈ కథ అనుకున్నప్పుడే అనుపమ పర్ఫెక్ట్ ఆప్ట్‌గా ఉంటుందని మేమిద్దరం అనుకున్నాం.
  • అనుపమ కథ విన్న వెంటనే ఓకే చెప్పారు. కథ వినగానే చాలా కనెక్ట్ అయ్యారు.
  • ఫస్ట్ కాపీ చూసి ఈ సినిమా తన కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుందని చాలా ఎమోషనల్ అయ్యారు.
  • క్యారక్టర్ ఓన్ చేసుకొని నటించారు, అలాగే ప్రమోషన్స్‌ని కూడా బాధ్యత తీసుకుని చేశారు.
  • అలాగే దర్శన, సంగీత గారి పాత్రలు కూడా అద్భుతంగా వుంటాయి. సంగీత గారు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు.
  • దుల్కర్ టీం ఈ సినిమా చూశారు. మలయాళంలో దుల్కర్ రిలీజ్ చేస్తున్నారు.
  • తప్పకుండా ఈ సినిమా మలయాళంలో కూడా చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని నమ్మకం ఉంది.

పరదాపై ఎలాంటి నమ్మకంతో ఉన్నారు?

  • ఈ రోజుల్లో కంటెంట్ నచ్చితేనే ఏ సినిమా అయినా చూస్తున్నారు.
  • ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉండబోతుంది. అలాగే ప్రతి సీన్, క్యారెక్టర్ బిహేవియర్ కొత్తగా ఉంటుంది.
  • డిఫరెంట్ సినిమాని ప్రేక్షకులు చూస్తారనే దానికి ఈ సినిమా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది.

ఈ సినిమాని చాలామందికి చూపించి వాళ్ళ ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎడిట్ చేశారని విన్నాం?

  • అవునండి. అది నేను సురేష్ బాబు గారి దగ్గర నేర్చుకున్నాను.
  • ఈ సినిమాని చాలామందికి చూపించి వాళ్ళ ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరిగింది.
  • అలాగే సురేష్ బాబు గారు, రానా గారు చూశారు. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు.
  • వాళ్ళ సజెషన్స్ తీసుకున్న తర్వాత సినిమా ఇంకా బెటర్ అయ్యింది.

డిఓపి మృదుల్ గురించి?

  • మృదుల్ అద్భుతమైన టెక్నీషియన్. ఇది ఫిమేల్ సెంట్రిక్ సినిమా కాబట్టి తన సెన్సిబిలిటీస్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి.
  • తను చాలా హార్డ్ వర్కర్. ప్యాకప్ అయ్యేంతవరకు ఫోన్ కూడా చూడదు. అంత ఫోకస్‌గా వర్క్ చేస్తుంది.
  • మనాలి, లడక్. ధర్మశాల, ఢిల్లీ లాంటి లొకేషన్స్‌లో సినిమాని షూట్ చేసాం.
  • సినిమాలో చాలా మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.
  • గోపిసుందర్ ఈ కథ విన్ షాక్ అయ్యారు. ఆయన కంటెంట్‌కి చాలా కనెక్ట్ అయ్యారు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.

పరదా కథ గురించి ఒక లైన్లో చెప్పాలంటే?

  • పరదా కల్చర్‌ని ఫాలో అవుతున్న ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి ఊర్లో ఒక సమస్య వస్తుంది.
  • ఆ సమస్యకి ఆ అమ్మాయి పరిష్కారం ఎలా వెతుక్కుంది అనేది కథ.

అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమిటి?

  • రెండు స్క్రిప్ట్స్ జరుగుతున్నాయి.
  • ప్రవీణ్‌తో ఒక స్క్రిప్ట్ జరుగుతుంది. రిలేషన్‌షిప్ థ్రిల్లర్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.