మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ చిరంజీవి – బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లిడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈసినిమా విఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఫైనల్ గా ఆ వర్క్ దాదాపు కంప్లీట్ అయినట్లే.విఎఫ్ఎక్స్ సన్నివేశాలు కూడా బాగా వచ్చాయట.ఈసినిమా నుండి ఇంతకుముందు గ్లింప్స్ అలాగే సాంగ్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈనెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.టీజర్ కట్ చేసి రెడీ గా వుంది.ఈ టీజర్ వచ్చాక సినిమాపై వున్న అనుమానాలు తొలిగిపోనున్నాయని సమాచారం.టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో వుండనుందట.రెండు మూడు రోజుల్లో ఈ అప్డేట్ గురించి అధికారిక ప్రకటన రానుంది.
భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో త్రిష ,ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటించగా కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రీయేషన్స్ నిర్మిస్తుంది.టీజర్ రిలీజ్ రోజు మూవీ రిలీజ్ డేట్ కూడా చెప్పే ఛాన్స్ లేకపోలేదు.
ఇక చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగా 157(వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నారు.ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























