నటీనటులు : రజినీకాంత్ ,నాగార్జున , సౌబిన్ షాహిర్, సత్యరాజ్ ,శృతి హాసన్
ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్
సంగీతం : అనిరుధ్
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
నిర్మాణం : సన్ పిక్చర్స్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కబాలీ రిలీజ్ టైంలో ఏ స్థాయిలో హైప్ సృష్టించారో, దాదాపు అదే స్థాయి క్రేజ్ కూలీకి వచ్చింది. ఈ క్రేజ్ వెనుక అనేక కారణాలు ఉన్నాయి.సూపర్ స్టార్ రజినీకాంత్ పాటు నాగార్జున, ఉపేంద్ర ఇందులో నటించడం ,వరుస ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం, అనిరుధ్ అదిరిపోయే సాంగ్స్ ఇవ్వడంతో రిలీజ్‌కు ముందు నుంచే సినిమా అద్భుతమైన బజ్ క్రియేట్ చేసింది.కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం కూలీ హైప్‌కు నిదర్శనం.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈసినిమా ఎలా వుందో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
చెన్నై పోర్టు ప్రాంతంలో కూలీగా పనిచేస్తూ, తన జీవితాన్ని సాధారణంగా గడుపుతున్న దేవా (రజినీకాంత్) ఒక అనాథాశ్రమం మరియు హాస్టల్ నిర్వహిస్తూ ఉంటాడు. దేవా స్నేహితుడు రాజశేఖర్ (సత్యరాజ్) ఒక కొత్త ఆవిష్కరణ మొబైల్ క్రిమేషన్ యూనిట్ (చనిపోయిన వారిని శుభ్రంగా, తక్కువ ఖర్చుతో దహనం చేసే పరికరం) రూపొందిస్తాడు. ఇది సమాజానికి ఉపయోగపడే టెక్నాలజీ. రాజశేఖర్ దాన్ని ప్రభుత్వానికి అందించబోతున్న సమయంలో అది సైమన్ (నాగార్జున) అనే శక్తివంతమైన వ్యాపారి చేతిలో పడుతుంది.సైమన్ దానిని తన వినీతి, మరియు క్రైమ్ నెట్‌వర్క్ కోసం ఉపయోగిస్తాడు.ఈ ప్రాసెస్ లో రాజశేఖర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తాడు.అయితే అధికారికంగా అతను ప్రమాదవశాత్తు చనిపోయాడని ధ్రువీకరించినా దేవా మాత్రం దాని వెనుక పెద్ద కుట్ర ఉందని గ్రహిస్తాడు.ఆ తరువాత ఏం జరిగింది? దేవా ఆ కుట్రని ఛేదించి తన స్నేహితుడి మరణానికి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అనేది మిగితా కథ.
విశ్లేషణ :
లోకేష్ కనగరాజ్ సినిమాల్లో స్టోరీ కంటే స్క్రీన్ ప్లే ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఖైదీ , విక్రమ్ ,లియో ఈ మూడు సినిమాల్లో ఈమ్యాజిక్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అయితే కూలీలో మాత్రం ఆ లెవెల్ స్క్రీన్ ప్లే మిస్ అయ్యిందని చెప్పొచ్చు.రెండు కథలను ప్యారలల్ గా నడిపి చివర్లో ముడివేయడం లోకేష్ స్పెషాలిటీ . కానీ కూలీ లో అది మిస్ అయ్యింది.
ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా సాగి సెకండ్ హాఫ్ ఫై అంచనాలను పెంచేస్తుంది. ఇందులో నాగ్ పాత్ర హైలైట్ అయ్యింది.విలన్ గా నాగ్ బీస్ట్ మోడ్ లో కనిపించారు.ఇక సెకండ్ హాఫ్ లో లోకేష్ మార్క్ కనిపించింది. రజినీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా బాగా చూపించాడు. ఇందులో రజినీ లుక్ కూడా సూపర్ అనిపిస్తుంది.ఆయన లుక్, స్వాగ్ అభిమానులను పండగ చేసుకునేలా చేస్తాయి. అయితే సినిమా అంత ఇలాంటి మూమెంట్స్ ఉంటే కూలీ మరో లెవెల్లో ఉండేది. ఎలివేషన్ల కు పెద్దగా పోలేదు.అక్కడక్కడ కొంచెం స్లో అయిన ఫీల్ తెప్పించింది.చివర్లో వచ్చే అమీర్ ఖాన్ క్యామియో పర్వాలేదనిపిస్తుంది.అయితే విక్రమ్ లో రోలెక్స్ లా ఈ పాత్ర ఉంటుందనుకుంటే ఆ విషయంలో కొంచెం నిరుత్సాహపరిచారు.అనిరుధ్ మ్యూజిక్, బీజీఎమ్ సినిమాలో మరో హైలైట్. ఓవరాల్ గా కూలీ బోర్ కొట్టకుండా డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ముగుస్తుంది. థియేటర్లలో ఈజీగా ఓ సారి చూసేయొచ్చు.
నటీనటుల విషయానికి వస్తే దేవా పాత్రలో రజనీకాంత్ అదరగొట్టారు.వయసు పెరిగినా, రజినీ స్క్రీన్ పై ఎనర్జిటిక్ గా కనిపించారు. తన స్టయిల్ , స్వాగ్ తో ఆకట్టుకున్నారు.ఆయన ఇంట్రో సీన్ సూపర్ కిక్ ఇస్తుంది.విలన్ పాత్రలో నాగార్జున సూపర్ అనిపించారు.తన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం.అయితే సెకండ్ హాఫ్ లో ఈ పాత్ర కనిపించదు.కేవలం సినిమాలో 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇక వీరిద్దరి తరువాత మలయాళ నటుడు సౌబిన్ పాత్ర సినిమాలో హైలెట్ అయ్యింది.ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిన షౌబిన్ నటన పరంగాను సూపర్ అనిపించారు సపోర్టింగ్ కాస్ట్ ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ తమ పాత్రల్లో బాగానే ఇంప్రెస్ చేశారు.అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో కనిపించారు.అయితే ఈ పాత్రను ఇంకొంచెం బాగా రాసుకోవాల్సింది.
టెక్నికల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది.లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ , డార్క్ థీమ్ బాగా డిజైన్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ భాగంలో ఉన్న ఎమోషనల్ హుక్ ఆకట్టుకుంటుంది. అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం.సాంగ్స్ సూపర్ అనిపించగా బీజీఎమ్ యాక్షన్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలను బాగా డిజైన్ చేశారు. ఎడిటింగ్ కొంచెం షార్ప్‌గా ఉంటే, సినిమా మరింత క్రిస్ప్‌గా ఉండేది.ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదనిపిస్తాయి .
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన కూలీ ఆ అంచనాలను అందుకుందని చెప్పొచ్చు.ఇందులో రజినీ నటన ,స్టైల్, లోకేష్ కనగరాజ్ ప్రెజెంటేషన్, నాగార్జున విలన్ యాక్టింగ్ , అనిరుధ్ బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.కథలో కొత్తదనం తక్కువైనా, ప్రెజెంటేషన్, ట్రీట్మెంట్ వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యాన్స్ కి ఈసినిమా బాగా నచ్చుతుంది.మిగితా వారు కూడా థియేటర్లలో ఈజీగా ఓసారి చూసేయొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























