కూలీపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఫస్ట్ రివ్యూ.. ఏమన్నారంటే?

Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin First Review on Coolie

సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘కూలీ’. నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ సాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ వీక్షించి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో.. “మన సూపర్ స్టార్ రజనీకాంత్ సర్ సినిమా పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను అభినందించడానికి నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. రేపు విడుదల కానున్న ఆయన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కూలీ సినిమాను ముందుగానే చూసే అవకాశం లభించింది. ఈ పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌ను నేను పూర్తిగా ఆస్వాదించాను.” అని చెప్పారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “ఈ సినిమా రేపు విడుదలైన ప్రతిచోటా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రజనీకాంత్ సర్, సన్ పిక్చర్స్, సత్యరాజ్ సర్, దర్శకుడు లోకేష్ కనగరాజ్, అమీర్ ఖాన్ సర్, నాగార్జున సర్, ఉపేంద్ర సర్, అనిరుధ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ మరియు ఈ సినిమా వెనుక ఉన్న మొత్తం బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.” అని తెలిపారు. కాగా ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక దీనిపై చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. “మీ ఆప్యాయమైన మాటలకు హృదయపూర్వక ధన్యవాదాలు ఉదయనిధి స్టాలిన్ గారు 🤗❤️❤️❤️ మీరు సినిమాను ఇష్టపడ్డారని తెలుసుకొని ఎంతో ఆనందంగా ఉంది సర్… దీనికి హృదయపూర్వక కృతజ్ఞతలు.” అని చెప్పారు. కాగా ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.