వార్ 2: రివ్యూ

War 2 Movie Review in Telugu

నటీనటులు: ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, తదితరులు
ఎడిటింగ్: ఆరిఫ్ షేక్
సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్
సంగీతం: ప్రీతమ్, సంచిత్ బల్హర మరియు అంకిత్ బల్హార
నిర్మాణం: యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌
నిర్మాత: ఆదిత్య చోప్రా
దర్శకత్వం: అయాన్ ముఖర్జీ

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హిందీ స్పై యాక్షన్ యూనివర్స్‌లో ‘వార్’ మూవీ ఒక మైలురాయి. అదే లెగసీని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు, మేకర్స్ ఇప్పుడు ‘వార్ 2’తో వచ్చారు. అయితే ఈసారి బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌తో పాటు మన తెలుగు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా ఈ గేమ్‌లోకి ఎంటర్ అవ్వడం ప్రత్యేకతగా నిలిచింది. విడుదలకు ముందే టీజర్లు, పోస్టర్లు, పాటలు సోషల్ మీడియాలో హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.

ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన వార్ 2 ఎలా ఉంది? ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ చేసిన హిందీ ఫిల్మ్ తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అలాగే హిందీ ప్రేక్షకులను ఆయన తన నటనతో మెప్పించారా? మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ నటన మన ప్రేక్షకులను అలరించిందా? కియారా క్యారక్టర్ లోని సస్పెన్స్ ఏంటి? ఇంతకూ ఈ చిత్రం సక్సెస్ అందుకుందా? లేదా? వంటివి తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:-

కథను ఎక్కువగా రివీల్ చేయకుండా చెప్పాలంటే.. కబీర్ (హృతిక్) ‘రా’ (RAW) ఏజెన్సీకి వ్యతిరేకంగా ‘కలి’ అనే ఉగ్రవాద సంస్థతో చేతులు కలుపుతాడు. ఈ క్రమంలో ప్రముఖుడు సునీల్ లూద్రా (అశుతోష్ రాణా)ను చంపుతాడు. అయితే ఇది ఒక ఆపరేషన్. కానీ, కబీర్ నేరస్థుడని భావించి, RAW అతన్ని పట్టుకోవాలని చూస్తుంది.

ఇందుకోసం విక్రమ్ (ఎన్టీఆర్) అనే ఏజెంట్ ని నియమిస్తారు.అలాగే అతనితోపాటు సునీల్ లూద్రా కుమార్తె కావ్య (కియారా)కూడా జాయిన్ అవుతుంది. వారు కబీర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించే ప్రక్రియలో, కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఆ మిషన్‌లో వచ్చే టర్న్స్, ట్విస్ట్స్, ఎమోషన్స్, యాక్షన్ హంగామా, చివరకు ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా.

విశ్లేషణ:-

సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులను నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. పాత్రల పరిచయం, వాటి టాస్క్ ఏంటనేది ముందే క్లియర్‌గా చేప్పేసాడు. ఎప్పుడైతే ప్రధాన పాత్రల మధ్య కాన్‌ఫ్లిక్ట్ మొదలవుతుందో అక్కడినుండి కథలో వేగం పెరుగుతుంది. ‘ఇండియా ఫస్ట్’ అనే లక్ష్యంతో ఇరువురు హీరోలు తమ తమ మిషన్ కొనసాగించాలని చూడటం, ఒకరి ప్రయత్నాలను మరొకరు అడ్డుకోవడం వంటివి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఈ క్రమంలో ఎవరు హీరో? ఎవరు విలన్ అనే డైలమా చూసే ప్రేక్షకుడి మదిలో మెదులుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ సినిమాకు బలం. అలాగే యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్‌తో ముగిసే క్లైమాక్స్ మెప్పిస్తుంది.

పర్ఫార్మెన్సెస్:-

  • ఎన్.టి.ఆర్: మాస్, క్లాస్ కలిసిన హై ఎనర్జీ ప్యాకేజీ రోల్‌లో కనిపించారు. ఆయన లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్ అన్నీ టాప్ క్లాస్. ప్రత్యేకంగా, ఫైట్ సీన్స్‌లోని ఇంటెన్సిటీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
  • హృతిక్ రోషన్: కూల్ అండ్ స్టైలిష్ క్యారక్టర్. కానీ ఇంటెన్స్ యాక్టర్‌గా మరోసారి రుజువు చేసుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఎక్కడా కాంప్రమైజ్ చేయలేదు.
  • కియారా అద్వాని: గ్లామర్‌తో పాటు, కథలో కీలక పాత్ర పోషించింది. స్క్రీన్ ప్రజెన్స్ బావుంది.
  • విలన్ క్యారెక్టర్‌లో జూన్ కపూర్ తనదైన ఇంపాక్ట్ చూపించాడు.

టెక్నికల్ విలువలు:-

  • డైరెక్షన్: అయాన్ ముఖర్జీ యాక్షన్ సినిమాకి కావాల్సిన పేస్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్ అన్నీ పర్ఫెక్ట్‌గా మిక్స్ చేశారు. స్క్రీన్‌ప్లేలో ఎక్కడా లాగ్ అనిపించదు.
  • సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్ ప్రతి లొకేషన్‌ను హాలీవుడ్ రేంజ్‌లో చూపించారు. ఇంటర్నేషనల్ యాక్షన్ సెట్స్ అద్భుతంగా ఉన్నాయి.
  • సంగీతం: ప్రీతమ్ ఇచ్చిన సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే సంచిత్ బల్హర మరియు అంకిత్ బల్హార అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.
  • ఎడిటింగ్: ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ లో తన ప్రతిభ చూపాడు. ఆయన ఎడిటింగ్ షార్ప్‌గా ఉండి సినిమాను బోర్ కొట్టకుండా చేసింది.
  • నిర్మాణ విలువలు: చాలా ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాతలు హై క్వాలీటీతో సినిమాను నిర్మించినట్టు తెలుస్తోంది. కథకి తగ్గట్టుగా ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతోంది. టెక్నికల్లీ టాప్ నాచ్ మూవీ.

హైలైట్స్:-

  1. ఎన్.టి.ఆర్ – హృతిక్ కాంబినేషన్ సీన్స్
  2. ఇద్దరి మధ్య స్క్రీన్‌పై కనిపించే కెమిస్ట్రీ, రైవల్రీ & బ్రదర్‌హుడ్ షేడ్స్.
  3. ఫస్ట్ హాఫ్‌లోని ఇంట్రడక్షన్ ఫైట్
  4. సాంగ్స్, విజువల్స్
  5. ఇంటర్వల్ బ్యాంగ్
  6. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్
  7. ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ క్లైమాక్స్
  8. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
  9. సెకండ్ హాఫ్‌లో కార్ చేజ్‌లు, హ్యాండ్-టు-హ్యాండ్ కాంబాట్
  10. ఎక్స్‌ప్లోషన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ హాలీవుడ్ స్టాండర్డ్‌లో ఉన్నాయి.

ముక్తాయింపు:-

ఓవరాల్‌గా వార్ 2 హాలీవుడ్ రేంజ్ యాక్షన్, టాలీవుడ్ మాస్ ఎనర్జీ కలిసిన పవర్‌ప్యాక్డ్ ఎంటర్టైనర్. ఎన్.టి.ఆర్, హృతిక్ రోషన్ జంట ఈ స్పై యాక్షన్ డ్రామాను మరోస్థాయికి తీసుకెళ్లింది. యాక్షన్ జానర్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే కాకుండా దేశభక్తి, మానవ విలువలు, ఎంత కష్టం ఎదురైనా లక్ష్యం సాధించాలనే తపన వంటి అంశాలు సాధారణ ప్రేక్షకులను సైతం ఎంగేజ్ చేస్తాయి. బిగ్ స్క్రీన్‌పై, మంచి సౌండ్ సిస్టమ్‌లో తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. మొత్తానికి ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు.

ఫ్యాన్స్ రియాక్షన్

ప్రేక్షకులు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి హ్యూ జ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. థియేటర్ల బయట డాన్స్‌లు, ఫైర్‌వర్క్స్, కేకలతో పండుగ వాతావరణం. నెలకొంది. టైటిల్స్ నుండే అరుపులతో థియేటర్లు హోరెత్తుతున్నాయి. ప్రత్యేకంగా ఎన్.టి.ఆర్ ఎంట్రీ సీన్‌కి థియేటర్ షేక్ అయిపోయింది. అలాగే తారక్-హృతిక్ డ్యాన్స్ కాంపిటీషన్ సాంగ్ వచ్చినప్పుడు అయితే అభిమానులు ఊగిపోయారు. ఇంకా ఫేస్-టు-ఫేస్ ఫైట్స్ వచ్చినప్పుడు కూడా విజిల్స్‌తో మోత మోగిస్తున్నారు. మొత్తానికి జూనియర్ అభిమానులకు ఇది పసందైన సినిమా అని చెప్పొచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.