మ్యూజిక్ సిట్టింగ్స్‌లో.. ఆంధ్రా కింగ్ తాలూకా టీమ్

Andhra King Taluka Gears Up For Musical Treat

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఇందులో ‘సూపర్ స్టార్‌’గా కనిపించనున్నారు. రామ్ ఆయన డై హార్డ్ అభిమాని పాత్రను పోషిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఆంధ్రా కింగ్ తాలూకా టీమ్ మ్యూజిక్ సెషన్స్ ప్రారంభించింది. ఇప్పటికే ‘నువ్వుంటే చాలే’ అనే పాటను రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో నెక్స్ట్ సాంగ్స్ మరియు బీజీఎమ్ వచ్చే వేరే లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్‌ను చార్ట్ బస్టర్‌గా మలచడానికి మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్-మెర్విన్ తన బృందంతో కలిసి కృషి చేస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగిన విధంగా మ్యూజిక్ అందించడానికి టీమ్ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది.

కాగా ఈ ఆల్బమ్‌లో మాస్ బీట్ సాంగ్స్‌తో పాటు, మెలోడియస్ ట్రాక్‌లు కూడా ఉండబోతున్నాయి. ఇక ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి పాటను వినేవారిని ఉర్రూతలూగించేలా, కథకు తగ్గట్టుగా రూపొందిస్తున్నారు. కాగా ఆంధ్ర కింగ్ తాలూకా మ్యూజిక్ సెషన్స్ స్టార్ట్ అవ్వడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. చార్ట్ బస్టర్ ఆల్బమ్ రాబోతోందనే నమ్మకం యూనిట్‌ సహా అభిమానుల్లో నెలకొంది.

టాప్ టెక్నిషియన్స్‌తో ఈ ప్రాజెక్ట్ అత్యున్నత స్థాయి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. కాగా ఇందులో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే రామ్ సరసన కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుండగా.. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు. హరీష్ తుమ్మల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ట్యాలెంటెడ్ స్టార్ కాస్ట్, అద్భుతమైన కథాంశం, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.