జాక్ తరువాత యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ తెలుసు కదాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.నీరజ కోనా డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీనిధి శెట్టి , రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా వచ్చిన మల్లికా గంధ సాంగ్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకోగా నిన్న సిద్దు పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో తను వరుణ్ పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.అక్టోబర్ 17న థియేటర్లోకి రానుంది. నీరజ కోనాకు దర్శకురిలాగా ఇదే మొదటి సినిమా. క్యాస్టూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు తెలుసు కదాతో డైరెక్షన్ లోకి అడుగు పెట్టారు. మరి ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఇక సమ్మర్ లో జాక్ తో వచ్చి షాక్ తిన్న సిద్దు ఈసారి తెలుసు కదా తో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఇక ఈసినిమా తరువాత సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ కృష్ణ అండ్ హిజ్ లీల ఫేమ్ రవికాంత్ పేరెపు డైరెక్షన్ లో బ్యాడాస్ లో నటించనున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించనున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























