మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్. కాగా ఇది రవితేజకు 75వ సినిమా కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మాస్ జాతర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ అయితే అదిరిపోయింది. రవితేజ మాస్ అవతార్‌లో అదరగొట్టేశాడు. లుక్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్.. అన్నింటిలో ఆయన స్టైల్ కనిపించింది. శ్రీలీల మరోసారి తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేసింది. భీమ్స్ మ్యూజిక్ బిగ్ ఎస్సెట్ కానుందని అర్ధమవుతోంది. మొత్తానికి టీజర్ సినిమాపై అంచనాలను బాగా పెంచేస్తోంది.
ఇక మాస్ జాతరలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ, ఈసారి మాస్ జాతరతో గట్టిగా కొట్టేలావున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























