వరుస విజయాలతో దూసుకుపోతున్న సీనియర్ హీరో బాలకృష్ణ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను ఈసినిమాను తెకెక్కిస్తున్నాడు.బ్లాక్ బస్టర్ కాంబో కావడం దానికి తోడు అఖండ భారీ విజయం సాధించడం తో సీక్వెల్ గా వస్తున్న అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి.రీసెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.అందులో భాగంగా బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేశారు.త్వరలోనే హిందీ వెర్షన్ కి కూడా బాలకృష్ణే డబ్బింగ్ చెప్పనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముందు చెప్పినట్లు సెప్టెంబర్ 25నే ఈసినిమాను విడుదలచేయనున్నారు. అయితే అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ కూడా విడుదలవుతుంది.ఈసినిమాపై కూడా అంచనాలు ఓరేంజ్ లో వున్నాయి.దాంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.అఖండ 2లో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్ర కీలక పాత్రల్లో నటించగా ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.
ఇక బాలకృష్ణ నెక్స్ట్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తన 111వ సినిమా చేయనున్నాడు.ఇంతకుముందు వీరి కాంబోలో వీర సింహా రెడ్డి రాగ సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు ఇదే కాంబో లో మరో సినిమా రానుంది.సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈసినిమాను నిర్మించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























