కూలీలో ఆ పాత్రకు నాగార్జున పేరు చెప్పగానే షాక్ అయ్యాను – రజినీకాంత్

Superstar Rajinikanth Says, I Was Shocked When Nagarjuna Was Cast For That Role in Coolie

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘కూలీ’. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగస్టు 14న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా  మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ మరియు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ.. “నాగార్జున గారు ఇందులో విలన్‌గా చేస్తున్నారు. ‘కూలీ’ సబ్జెక్ట్‌ విన్న వింటనే సైమన్‌ పాత్ర నేనే చేయాలన్న ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా? అని ఎదురుచూశా. ఎందుకంటే చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఆర్నెళ్ల పాటు వెతికాం. ఈ పాత్ర గురించి ఒక యాక్టర్ తో ఆరుసార్లు సిటింగ్‌ అయింది. ఆయన్ని ఎలాగైనా ఒప్పిస్తాను అని లోకేశ్‌ నాతో అన్నారు.”

“ఎవరు ఆయన? అని నేను అడిగా. నాగార్జున పేరు చెప్పగానే షాక్ అయ్యాను. ఆ తర్వాత ఆయన ఒప్పుకొన్నారని తెలిసి హ్యాపీగా అనిపించింది. నాగార్జున గారు డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదు. ఆయనకు ఆ అవసరం లేదు. ఎప్పుడూ మంచివాడిగానే చేయాలా? అని ఆయన సైమన్‌ పాత్రకు ఒప్పుకొని ఉంటారు. మేమిద్దరం 33 ఏళ్ల కిందట ఒక సినిమా చేశాం. అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారు.”

“ఇంకా యంగ్ గా కనిపిస్తున్నారు. నాకు జుట్టు కూడా ఊడిపోయింది. నాగార్జున గారితో పని చేస్తుండగా ‘మీ ఆరోగ్య రహస్యం ఏంటి’ అని అడిగాను. ‘ఏమీ లేదు సర్‌.. వ్యాయామం, స్విమ్మింగ్, కొద్దిగా డైట్‌. సాయంత్రం 6 గంటలకు డిన్నర్‌ అయిపోతుంది. మా నాన్న నుంచి వచ్చిన జీన్స్‌ కూడా ఒక కారణం. దాంతో పాటు, నా నాన్న నాకో సలహా ఇచ్చారు. ‘బయట విషయాలు తలలోకి ఎక్కించుకోవద్ద’ని చెప్పారు’ అని నాగార్జున గారు నాతో చెప్పారు.”

“17 రోజుల షెడ్యూల్‌ కోసం ఇద్దరం థాయ్‌లాండ్‌ వెళ్లాం. అది నా జీవితంలో మర్చిపోను. సైమన్‌ పాత్రలో ఆయన నటన చూస్తుంటే, నాకే ఆశ్చర్యమేసింది. బాషా-ఆంటోనీ ఎలాగో.. కూలీ-సైమన్‌ అలా ఉంటుంది. సైమన్ గా నా నాగార్జున అదరగొట్టేశారు. అనిరుధ్ రవిచంద్రన్‌  అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమా గొప్పగా ఆడాలని మీరు అందరూ ఆదరరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.