క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి కథానాయికగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’. UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇది బ్లాక్ బస్టర్ ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్కకు నాల్గవ చిత్రం కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో తమిళ స్టార్ విక్రమ్ ప్రభు దేశీ రాజు అనే లీడ్ క్యారెక్టర్‌ని పోషిస్తున్నాడు. అనుష్క జన్మదినం సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో ఆమె ఇంటెన్స్ అండ్ వైలెంట్ క్యారెక్టర్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఘాటీ నుండి కీలక అప్డేట్ అందించారు మేకర్స్. ఆగస్టు 6న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే దీనితోపాటు న్యూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. కాగా ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























