మచ్ అవైటెడ్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది.ఎన్టీఆర్ ఉండడం తో ఈసినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి. ప్రమోషన్స్ లో మాత్రం జోరు పెంచాల్సివుంది.రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సూపర్ అనిపించుకుంది. ఈసినిమానుండి రేపు ఫస్ట్ సాంగ్ రానుంది. ఇక ఈసినిమా రన్ టైం కూడా రివీల్ అయ్యింది. దాదాపు 3 గంటల 5నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది.నాన్ స్టాప్ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ అవ్వనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ విడుదలచేస్తున్నాడు.అందుకు గాను భారీ ధరకు తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నాడు.దాంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 100 కోట్లపైనే రాబట్టాల్సివుంది.ఎన్టీఆర్ ఉన్నాడనే నమ్మకంతో నాగవంశీ సినిమాపై కాన్ఫిడెంట్ గా వున్నాడు. అయితే బాక్సాఫీస్ వద్ద తెలుగు ,తమిళంలో వార్ 2 భారీ పోటీ ఎదురుకోవాల్సి వుంది. ఎందుకంటే ఆగస్టు 14న కూలీ కూడా విడుదలవుతుంది.ఈసినిమాకు సౌత్ లో ఓ రేంజ్ లో హైప్ వుంది.దాంతో వార్ 2కు బాక్సాఫీస్ వార్ తప్పదు.
బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























