యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నుండి వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా.ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోనా ఈసినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి నిన్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.మల్లికా గంధ అంటూ సాగే ఈ పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు యూట్యూబ్ లో 2 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.సాంగ్ విన్న వాళ్ళదగ్గరి నుండి పాజిటివ్ టాక్ వస్తుంది.ఈసాంగ్ తో తమన్ – సిద్ శ్రీరామ్ కాంబోలో మరో చార్ట్ బస్టర్ వచ్చింది.కోరస్ సింగింగ్ కూడా ఆకట్టుకుంది.కృష్ణకాంత్ ఈ పాటను రచించారు.ఓవరాల్ గా ఈ సాంగ్ తో సినిమాకు బజ్ తీసుకొచ్చారు.
ఈసినిమాలో సిద్దు సరసన రాశి కన్నా ,నిధి శెట్టి హీరోయిన్లు గా నటించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. అక్టోబర్ 17న థియేటర్లోకి రానుంది. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్ల తో ఫుల్ రైజింగ్ లో వున్న సిద్దుకి రీసెంట్ గా జాక్ షాక్ ఇచ్చింది.ఈసినిమా నిరాశపరచడంతో తెలుసు కదాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు సిద్దు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























