బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2 ట్రైలర్ నిన్న రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. హిందీ సినిమా అయినా ఎన్టీఆర్ ఉండడం తో దాదాపు హిందీ తో సమానంగా తెలుగు వెర్షన్ ట్రైలర్ వ్యూస్ ను రాబట్టుకుంటుంది.మొత్తం హిందీ ,తెలుగు , తమిళ భాషల్లో కలిపి 90 మిలియన్ల వ్యూస్ ను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగులో ఈసినిమాను నాగవంశీ విడుదలచేస్తున్నాడు.అందుకు గాను భారీ ధరకు ఈ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నాడు.ఈసినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్లపైనే రాబట్టాల్సివుంటుంది.అయితే ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.వార్ 2 విడుదలవుతున్న రోజే లోకేష్ కనగరాజ్ -రజినీకాంత్ ల కూలీ కూడా విడుదలకానుంది.ఈసినిమాపై కూడా అంచనాలు భారీగా ఉండడంతో వార్ 2కు బాక్సాఫీస్ వద్ద వార్ ఎదురుకానుంది.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నవార్ 2లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా హిందీ ,తెలుగు తోపాటు తమిళంలో ఆగస్టు 14న విడుదలకానుంది.ప్రమోషన్స్ లో భాగంగా త్వరలోనే తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























