ఎన్టీఆర్-నీల్ టైటిల్ అదే.. కన్ఫర్మ్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్

NTR-Neel Prithviraj Sukumaran Confirms Movie Title as Dragon

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఎన్టీఆర్-నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్’ సిరీస్ మరియు సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. 1960ల నాటి కథతో తెరకెక్కుతోంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై చాలా అంచనాలున్నాయి. కొన్నిరోజుల క్రితం షూటింగ్ మొదలవగా, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్‌గా జరిగిన సెకండ్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఇందులో ఆయనపై కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక ఇదిలావుంటే, ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. అయితే దీనిని చిత్ర యూనిట్ ఖరారు చేయాల్సివుంది. వచ్చే ఏడాది జూన్ 25న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ లీక్ అయింది. ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్టుగా తెలిసింది. ఈ మేరకు ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎన్టీఆర్-నీల్ చిత్రాన్ని ‘డ్రాగన్’గా క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. ఇక ఇందులో మ‌ల‌యాళ స్టార్ యాక్టర్స్ టోవినో థామ‌స్, బీజు మేన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నట్టు కూడా ఆయన రివీల్ చేశారు.

అలాగే ప్ర‌శాంత్ నీల్ తన సినిమాలలో ఆర్టిస్టులకు రెస్పెక్ట్ ఇస్తాడ‌ని, వారికోసం మంచి పాత్రలు క్రియేట్ చేస్తుంటారని, ఇప్పుడు డ్రాగన్ సినిమాలో కూడా టోవినో థామ‌స్, బీజు మేన‌న్ ఇద్ద‌రికి బెస్ట్ రోల్స్ ఇస్తాడ‌ని తనకు న‌మ్మ‌కం ఉందని పేర్కొన్నారు పృథ్వీరాజ్. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. దీంతో తారక్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ పెట్టారంటూ మురిసిపోతున్నారు.

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దాదాపు అన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చే రవి బస్రూర్ దీనికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తోన్న సినిమా కావడం, మరోవైపు ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ తో సాలిడ్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలైతే ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.