సూపర్ స్టార్ రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ ల కూలీ విడుదలకు సిద్దమవుతుంది.ఈసినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.అయితే యూఎస్ఏ లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు అప్పుడే 300K డాలర్ల ప్రీ సేల్స్ అయ్యాయి.ట్రెండ్ చూస్తుంటే ప్రీమియర్స్ తోనే ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.ఆగస్టు 2న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.మరి ట్రైలర్ సినిమా మీద వున్న అంచనాలను మరింతగా పెంచుతుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,సత్య రాజ్ ,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరవనున్నాడు.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఇక ప్రస్తుతం లోకేష్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోట్ చేస్తున్నాడు.త్వరలోనే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపనున్నారు.
ఆగస్టు 14న కూలీ తమిళ్ తోపాటు తెలుగు ,హిందీలోనూ విడుదలకానుంది.అయితే ఈసినిమాకు తెలుగు ,హిందీలో భారీ పోటీ ఎదురుకానుంది.కూలీ రిలీజ్ అవుతున్న రోజే వార్ 2 కూడా వస్తుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























