బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది సైయారా. చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.వర్కింగ్ డేస్ లోకూడా 30 కోట్లకు తగ్గకుండా వసూళ్లను రాబడుతూ దుమ్ము రేపుతోంది.నిన్న కూడా అదే జోరు కొనసాగించడం తో 33కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొంది.దేశ వ్యాప్తంగా ఈసినిమా 5 రోజుల్లో 155కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకోగా ప్రపంచ వ్యాప్తంగా 225 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో ఈఏడాది 200కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన 5వ హిందీ సినిమాగా సైయారా రికార్డు సృష్టించింది. ఈరోజు తో 250 కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సైయారా జోరు చూస్తుంటే ఫుల్ రన్ లో 400కోట్ల మార్క్ ను క్రాస్ చేసేలానే వుంది.లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా ఊహించని రన్ ను కొనసాగిస్తూ ట్రేడ్ ను సైతం ఆశ్చర్య పరుస్తుంది.బయ్యర్లకు పాలిట సైయారా జాక్ పాట్ లా మారింది.
ఈసినిమాలో అహాన్ పాండే ,అనీత్ పడ్డా జంటగా నటించారు.వీరిద్దరికి ఇదే మొదటి సినిమా అయినా యాక్టింగ్ లో అదరగొట్టారు.ఫస్ట్ సినిమాతోనే ఈ జంట రికార్డులు కొల్లగొడుతున్నారు.మోహిత్ సూరి ఈసినిమాను తెరకెక్కించగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























