ఒకప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యకి తమిళ్ తో సమానంగా తెలుగులో కూడా అంతే మార్కెట్ ఉండేది.అయితే వరుస పరాజయాలు సూర్య తెలుగు మార్కెట్ ను ప్రభావితం చేశాయి.ఇప్పుడైనా సరైన సినిమా ఒక్కటి పడితే సూర్య మార్కెట్ మళ్ళీ రైజ్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు.ఇక సూర్య రీసెంట్ గా రెట్రోతో ప్రేక్షకులముందుకు రాగ ఈసినిమా కూడా విజయాన్ని అందించలేకపోయింది.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.నిన్న ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేసిన ఈ టీజర్ లో సూర్య ఫుల్ మాస్ గా కనిపించి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చాడు.తెలుగులోనూ ఈ టీజర్ రిలీజ్ అవ్వగా యూట్యూబ్ లో ఇప్పటివరకు 3 మిలియన్లకు కు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతుంది.హిట్ టాక్ వస్తే కరుప్పు తెలుగులోకూడా మంచి వసూళ్లను రాబట్టుకోవడం ఖాయం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటించింది.స్వసికా ,కాళీ వెంకట్ ,నటరాజన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యకంర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఈ దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.మిగితా భాషల్లోనూ ఈసినిమా కరుప్పు అనే టైటిల్ తోనే విడుదలకానుంది.
ఇక సూర్య ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తన 46వ సినిమా చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత సూర్య తెలుగులో సినిమా చేస్తున్నాడు.ఇందులో ప్రేమలు బ్యూటీ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగ వంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























