కిష్కింధపురి రిలీజ్ డేట్ లాక్

Kishkindhapuri sets its release date

ఎప్పటి నుండో కెరీర్ లో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అందులో భాగంగా రీసెంట్ గా భైరవం తో రాగా ఆ సినిమా డీసెంట్ రివ్యూస్ ను తెచుకుంది.అయితే బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని అందించలేకపోయింది.ఇక సాయి శ్రీనివాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో కిష్కింధపురి ఒకటి. చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను తీసుకొచ్చింది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్.అన్ని కుదిరితే సెప్టెంబర్ 12న థియేటర్లలోకి తీసుకున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రానుంది.ఈసినిమాకు సామ్ సీఎస్ ,చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.

ఇక ఈసినిమా కాకుండా సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు ,హైందవ సినిమాలు కూడా చేస్తున్నాడు.టైసన్ నాయుడుని భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు.14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటుంది.ఇంతవరకు పెద్దగా అప్డేట్స్ మాత్రం బయటికి రాలేదు.

ఇక హైందవ డిఫ్రెంట్ సబ్జెక్టు తో వస్తుంది.లుధిర్ బైరెడ్డి డైరెక్ట్ చేస్తుండగా అకల్ట్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా మూన్ షైన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.మరి ఈమూడు సినిమాలు సాయి శ్రీనివాస్ కు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాయో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.