హ‌రిహ‌ర వీరమ‌ల్లు బుకింగ్స్ ప్రారంభం

Hari Hara Veera Mallu Movie Bookings Open Now

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ఆయనకు ఇదే మొదటి పాన్-ఇండియా చిత్రం ఇదే కావడం గమనార్హం. జూలై 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. రీసెంట్‌గా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ మూవీపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరిహర వీరమల్లు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ‘లైఫ్ ఇన్ డిస్ట్రిక్ట్’ యాప్ https://link.district.in/DSTRKT/hhvm1 లో మీ టిక్కెట్లను బుక్ చేసుకోండి అని తెలిపింది. అలాగే మ‌రికొన్ని గంట‌ల్లో బుక్‌ మై షోలో కూడా బుకింగ్స్ ఓపెన్ అవుతాయని కూడా చిత్ర‌బృందం వెల్లడించింది. ఇక చాలా ఏళ్ల తర్వాత పవర్ స్టార్‌ని బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది పండగలాంటి వార్తే అని చెప్పాలి.

క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.