ఉస్తాద్ రామ్ పోతినేని – డైరెక్టర్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది.దాదాపు నెలరోజులపైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఇక ఈసినిమా నుండి రేపు ఫస్ట్ సింగిల్ రానుందని తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేశారు.ప్రోమో చూస్తుంటే నువ్వు ఉంటేచాలే అంటూ సాగే ఈ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యాలానే వుంది.ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్ కానుంది.రామ్ ఈ సాంగ్ ను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు. ఫస్ట్ టైం రామ్ ఈసాంగ్ కోసం లిరిక్ రైటర్ గా మారాడు.ఈరొమాంటిక్ సాంగ్ మ్యాజిక్ చేయడం ఖాయం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో నటిస్తుండగా తనకు వీరాభిమానిగా సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నాడు.ఇందులో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా చేస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక ఈసినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని రామ్ చూస్తున్నాడు.సినిమా కూడా బాగా వస్తుందన్న టాక్ వినిపిస్తుంది.రామ్ ఫ్యాన్స్ కూడా ఈసినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.మరి ఈసారి ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ కం బ్యాక్ అవుతాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























