ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరవడం విశేషం. ఇక మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజమౌళి గారికి, మీడియా వారికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సాయి గారికి థాంక్యూ సో మచ్. ఈరోజు నాకు అమ్మవారు విగ్రహాన్ని ఇచ్చారు. వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ రాధాకృష్ణ గారు మూడేళ్లు కష్టపడి ఒక అద్భుతమైన సినిమాతో మన ముందుకు వస్తున్నారు.”
“నాకు వైరల్ వయ్యారి టాగ్ వచ్చిందంటే దేవిశ్రీ ప్రసాద్ గారి వల్లే. సాంగ్ షూట్ జరిగినప్పుడు కూడా మా అందరికీ వచ్చి ఒక ఎనర్జీ ఇచ్చారు. అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చిన ప్రసాద్ గారికి థాంక్యూ సో మచ్. సెంథిల్ గారితో పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. జెనీలియా గారు తెలుగు సినిమాల్లో ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఆమెతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. మా హీరో కిరీటి గారికి సినిమా తప్పితే మరొక ధ్యాస లేదు. చాలా డెడికేషన్‌తో పని చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























