‘జూనియర్’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు ట్యాలెంటెడ్ నటుడు కిరిటీ రెడ్డి. ఇతను కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు అన్న విషయం తెలిసిందే. శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. స్టార్ టెక్నీషియన్స్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేయడంతో ఈ మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనెల 18న జూనియర్ థియేటర్లలోకి రానుంది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలకానుంది. దీంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలలో జోరు పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘వైరల్ వయ్యారి’ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్ము రేపడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే రీసెంట్గా విడుదలచేసిన ట్రైలర్ కూడా అంచనాలు పెంచేసింది.
ఈ నేపథ్యంలో మేకర్స్ నేడు జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో వేదికగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగనుంది. ఇక ఈ ఈవెంట్‌కు మావెరిక్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నారు. చిన్న సినిమాలను, ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే యువ నటీనటులను ప్రోత్సహించడంలో రాజమౌళి తొలినుంచీ ముందుంటుంటారన్న విషయం తెలిసిందే.
కాగా రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ నటి జెనీలియా, కన్నడ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో కిరీటి రెడ్డి సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























