కోర్ట్ తో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. అందులో తను హీరోగా నటిస్తున్న ప్రేమంటే ఒకటి. “థ్రిల్-యు ప్రాప్తిరస్తు!” అనేది ట్యాగ్‌లైన్.టాప్ ప్రొడ్యూసర్స్ రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆనంది హీరోయిన్ కాగా ప్రముఖ యాంకర్-నటి సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేయడంతో పాటు జాన్వి నారంగ్ ఈ మూవీతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు యువ సామ్రాట్ నాగ చైతన్య ఈసినిమా ఫస్ట్-లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. లీడ్ పెయిర్ రొమాంటిక్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తున్న ఈ పోస్టర్ లవ్లీగా వుంది.ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తోంది. ‘గామి’ చిత్రానికి గద్దర్ అవార్డు అందుకున్న విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, బ్లాక్ బస్టర్ ‘డ్రాగన్’ కు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. రాఘవేంద్ర తిరున్ ఎడిటర్, అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైనర్, కార్తీక్ తుపురాని, రాజ్ కుమార్ సంభాషణలు అందిస్తున్నారు.ప్రేమంటే షూటింగ్ 65% పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
ఇక ప్రియదర్శి ప్రస్తుతం ఈసినిమాతో పాటు మిత్రమండలి అనే సినిమాలో ఓ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామాగా విజయేందర్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈసినిమా కుడా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























