పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇంతకుముందు పలు మార్లు రిలీజ్ డేట్ ప్రకటించాక వాయిదా పడగా ఈసారి మాత్రం పక్కాగా చెప్పినట్లు జూలై 24న విడుదలకానుంది.అందులో భాగంగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వగా 2 గంటల 42 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.ఇక సినిమా చూసి సెన్సార్ బోర్డు సభ్యులు ఇంప్రెస్ అయ్యారని సమాచారం. చివర్లో ట్విస్ట్ హైలైట్ గా వుండనుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి కావొస్తుంది. రేటుకు వెనుకాడకుండా బయ్యర్లు సినిమాను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం నిర్మించారు.చాలా గ్యాప్ తరువాత పవన్ నుండి వస్తున్న సినిమాకావడంతో హరి హర వీరమల్లు పై భారీ అంచనాలు వున్నాయి.
ఇక పవన్ రీసెంట్ గానే ఓజీ షూటింగ్ కంప్లీట్ చేయగా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈనెలలో పవన్ పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























