యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ కె – రాంప్ నుండి గ్లింప్స్ విడుదలైంది.ఈరోజు కిరణ్ బర్త్ డే సందర్భంగా ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది.ఇందులో కిరణ్ చాలా కొత్తగా యాక్టీవ్ గా కనిపించాడు.లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గానే కేరళ షెడ్యూల్ కంప్లీట్ కాగా త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుండగా చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.సామజవరగమన నిర్మాత రాకేష్ దండా నిర్మిస్తున్నారు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.అక్టోబర్ 18న సినిమా థియేటర్లోకి తీసుకురానున్నారు.అయితే గత ఏడాది క తో కెరీర్ లో సాలిడ్ హిట్ కొట్టిన కిరణ్ ఆ తరువాత దిల్ రుబాతో నిరాశపరిచాడు.ఇక ఈసారి కె – రాంప్ తో హిట్ కొట్టి ఎలాగైనా ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
ఇక కిరణ్ ప్రస్తుతం ఈసినిమా తోపాటు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా కూడా చేస్తున్నాడు.ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ హీరోయిన్ నటిస్తుండగా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.నంబూరి రవి డైరెక్ట్ చేస్తుండగా బేబి డైరెక్టర్ సాయి రాజేష్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























