భారతీయ సినిమా రంగంలో బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు నాలుగు దక్షిణాది భాషల పరిశ్రమలకు కూడా మెజారిటీ వాటా ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం ఇండస్ట్రీలు ప్రతి సంవత్సరం వందలాది సినిమాలు నిర్మిస్తుంటాయి. అయితే వీటిలో శాండల్‌వుడ్‌గా పేరొందిన కన్నడ చిత్రపరిశ్రమకు ఓ స్పెషాలిటీ ఉంది. అన్ని దక్షిణాది పరిశ్రమలలో తొలితరంలో దాదాపు ఇద్దరు హీరోలు అగ్ర తారలుగా వెలుగొందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్.. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ ఇలా ఉంటే, కన్నడలో మాత్రం రాజ్‌కుమార్ ఒక్కరే ఏకైక తారగా వెలుగొందారు. దాదాపు 6 దశాబ్దాలపాటు రాజ్‌కుమార్ ఒక్కరే కన్నడలో సూపర్ స్టార్‌గా కొనసాగడం విశేషం. రాజ్‌కుమార్ ఉండగానే, ముగ్గురు కుమారులు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ ఆయన వారసులుగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.
వీరిలో పెద్దవాడు డా. శివ రాజ్‌కుమార్. ఈ స్టార్ హీరోకి కరుణాడ చక్రవర్తి, కర్ణాటక రత్న అనే బిరుదులూ కూడా ఉన్నాయి. అలాగే అభిమానులందరూ ఆయనను ముద్దుగా ‘శివన్న’ అని కూడా పిలుచుకుంటుంటారు. అయితే కేవలం వెండితెర హీరోగానే కాకుండా, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడిగా, మంచి డాన్సర్‌గా, సింగర్‌గా మరియు ప్రజాహిత నాయకుడిగా కూడా శివ రాజ్‌కుమార్ గుర్తింపు తెచ్చుకున్నారు.
కాగా శివ రాజ్‌కుమార్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. 1962 జూలై 12న జన్మించిన ఆయన నేడు 63వ పడిలోకి అడుగుపెట్టారు. ఇక రాజ్‌కుమార్ ఫ్యామిలీకి కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులున్న నేపథ్యంలో శివ రాజ్‌కుమార్ గారికి కన్నడ ప్రేక్షకులే కాకుండా అన్ని భాషలకు చెందిన ఆయన అభిమానులు, ఇంకా తెలుగు ప్రేక్షకులు కూడా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కరుణాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ గారిపై స్పెషల్ స్టోరీ..
రాజ్‌కుమార్ కుటుంబ వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శివ రాజ్‌కుమార్, 1986లో వచ్చిన తన మొదటి చిత్రం ‘ఆనంద్’ తోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆపై వరుసగా ‘ఆనంద, రాథాసప్తమి, మను’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన 120కి పైగా చిత్రాల్లో అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ క్రమంలో యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, సైకాలజికల్, సస్పెన్స్, బయోపిక్‌లు వంటి విభిన్న జానర్లను టచ్ చేశారు.
‘జైంథి, వెద, భైరగి, కవచ’ వంటి సూపర్ హిట్ సినిమాలతో శివ రాజ్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. కాగా దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో శివ రాజ్‌కుమార్ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. డాక్టరేట్, స్టేట్ అవార్డ్స్, ఫిల్మ్‌ఫేర్, ఉత్తమ నటుడు వంటి ఎన్నో పురస్కారాలు లభించాయి. తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ ఆత్మీయత, మాతృభూమి పట్ల గౌరవం ఆయన లోనూ కనిపిస్తుంది.
అయితే 2021లో తన చిన్న తమ్ముడు, శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ఆయనను బాగా కృంగదీసింది. ఈ షాక్ నుంచి వారి ఫ్యామిలీ ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. అయితే దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న అభిమానులు మరియు కన్నడ ప్రేక్షకులను అలరించేందుకు శివ రాజ్‌కుమార్ మళ్ళీ సినిమాలలో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’లో కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే కన్నడలో పలు సినిమాలలో నటిస్తున్నారు.
ఇక తన అసాధారణ ఎనర్జీ, అకుంఠిత కమిట్మెంట్తో 63 ఏళ్ల వయస్సులోనూ పలువురికి ప్రేరణనివ్వగల వ్యక్తిగా నిలుస్తున్నారు డా. శివ రాజ్‌కుమార్. ఆయన నటన, విలువలతో కూడిన జీవితం ఇప్పటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగు ఫిల్మ్ నగర్ తరపున శివ రాజ్‌కుమార్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























