టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన UV క్రియేషన్స్ మరో బ్యానర్ అయిన UV కాన్సెప్ట్స్ పతాకంపై ‘ఏక్ మినీ కథ’ ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’. తెలుగు-తమిళ్ భాషలలో బై లింగ్యువల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కొన్నిరోజులక్రితం ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అయితే నేడు హీరో సంతోష్ శోభన్ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కపుల్ ఫ్రెండ్లీ నుంచి తాజాగా ఆయన బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. హెల్మెట్ పెట్టుకుని బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న ఈ పోస్టర్లో సంతోష్ లుక్ ఆకట్టుకుంటోంది.
ఇక ఈ సినిమా కోసం ఆదిత్య రవీంద్రన్ అద్భుతమైన స్వరాలు సమకూరుస్తుండగా.. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే గణేష్ శివ ఎడిటింగ్, మైఖేల్ BFA కళా దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ సినిమాకు అజయ్ కుమార్.పి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగంగా పూర్తిచేసి త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























