టీవీ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ది 100’. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ పాటలు, హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. జూలై 11న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా హీరో ఆర్కే సాగర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాకి ‘ది 100’ టైటిల్ పెట్టడానికి కారణం?
- మేము ఒక సినిమాలాగే ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టాను.
- ‘ది 100’ అనే టైటిల్ వచ్చిన తర్వాత సినిమాకి ఒక ఎమోషన్ వచ్చింది.
- సొసైటీకి ఏదైనా మంచి చేయాలి అనే తపనతో పెట్టిన టైటిల్ ఇది.
- లక్కీగా కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్గా కుదిరింది.
- సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి 100 అనే టైటిల్ ఎందుకు పెట్టామో మీకు తెలుస్తుంది.
- ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది.
- త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ది 100.
- ఈ సినిమాకి అంత పవర్ ఉంది. వెరీ టచింగ్ పాయింట్.
- ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమా మస్ట్‌గా చూడాలి.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమా గురించి చాలా ఎమోషనల్ అయ్యారు కదా.. మీకు ఎలా అనిపించింది?
- మంత్రిగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన ఈవెంట్ కి ఒక గెస్ట్‌గా వచ్చి మా పుటేజ్ చూసి చాలా అద్భుతంగా ఫీలయ్యారు.
- మమ్మల్ని గొప్పగా బ్లెస్ చేశారు. ఆయనకి కంటెంట్ చెప్పాను. ఆయన కచ్చితంగా ఫస్ట్ రోజునే ఈ సినిమా చూస్తానని చెప్పారు.
- సినిమా చూసిన తర్వాత ఇంకా గొప్పగా చెప్తారని భావిస్తున్నాను.
- కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే చాలా అద్భుతమైన సందేశం ఉన్న సినిమా ఇది.
- అందుకే ఈ సినిమా గురించి ప్రముఖులకి చెప్పడం జరిగింది.
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు లాంటి వారు సినిమా చూసి అద్భుతంగా ఉందని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.
- అలాంటి కంటెంట్‌తో వస్తున్నాం కాబట్టి ప్రముఖులు మాట్లాడితే ఈ సినిమా ఇంకా జనాల్లోకి రీచ్ అవుతుందని భావించాము.
- అందుకే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము.
- నిజానికి ఒక రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసి ఉంటే ఆయన దగ్గరికి వెళ్లే వాళ్ళం కాదు.
- ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అందరికీ రీచ్ అవ్వాలి.
- అలా రీచ్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు మాట్లాడితే ఇంకా అద్భుతంగా రీచ్ అవుతుంది.
- కళ్యాణ్ గారికి కంటెంట్ చాలా బాగా నచ్చింది. అందుకే ఆయన ట్రైలర్‌ని లాంచ్ చేశారు.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
- ఇప్పటివరకు చాలా పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి కానీ ఇందులో క్యారెక్టర్ మాత్రం ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది.
- ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్లే ఈ విషయం చెప్తారు.
మొగలిరేకులు సీరియల్లో ఆర్.కె నాయుడు క్యారెక్టర్ చాలా మంచి పేరు తీసుకొచ్చింది కదా.. మళ్ళీ అలాంటి క్యారెక్టర్‌తో సినిమా ఎందుకు చేయలేదు?
- దాదాపు ఆరు సంవత్సరాలు నేను ఆర్కే నాయుడు క్యారెక్టర్ లోనే ఉన్నాను.
- సినిమాల్లో చేసినప్పుడు ఆ క్యారెక్టర్‌కి భిన్నమైన క్యారెక్టర్స్, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనే ఆలోచనతో ‘మాన్ అఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాదీ ముబారక్’ లాంటి సినిమాలు చేశాను.
- ఆడియన్స్ మళ్ళీ ఒక పోలీస్ క్యారెక్టర్ని కోరుకున్నారు.
- అలా పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే మళ్ళీ ఒక బలమైన కథ కుదరాలి. అలాంటి కథ 100లో కుదిరింది.
- ఈ క్యారెక్టర్ ఆర్కే నాయుడు కంటే అథెంటిక్‌గా ఉంటుంది.
ఈ కథ ఎలా పుట్టింది?
- ఇది ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఆలోచన. సినిమాగా తీసుకోవచ్చా అని అడిగాను.
- పేరు పెట్టకుండా తీసుకోవచ్చు అని చెప్పారు. దాదాపు ఆలోచనని నాలుగు సంవత్సరాలు పాటు నా బుర్రలో మోసాను.
- ఒకసారి సుకుమార్ గారి దగ్గరికి లంచ్‌కి వెళ్ళాను. కథల గురించి డిస్కషన్ వచ్చింది.
- అప్పుడు ఈ కథ చెప్పాను. ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు.
- ముందు ఇలాంటి కథ చేయాలని చెప్పారు. వాళ్ళ టీం తో కొన్ని రోజులు జర్నీ జరిగింది.
- తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్స్‌లో బిజీ అయ్యారు. ఈ కథ చేసుకుంటానని ఆయనకి చెప్పాను.
- తర్వాత కథని పూర్తిస్థాయిలో సిద్ధం చేశాం. 100% కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లాం.
ఈ మధ్యకాలంలో మీరు మిస్సయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా?
- ‘ఓజి’ సినిమాలో ఒక ఆఫర్ వచ్చింది. కానీ ఏదో మిస్ కమ్యూనికేషన్ వల్ల అది కుదరలేదు.
- అయితే ఆయనతో ఉంటున్నాం కాబట్టి మిస్ అయిన ఫీలింగ్ కలగడం లేదు.
మిషా, ధన్య క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి?
- మిషన్ క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చూస్తే కళ్ళల్లో నీళ్లు ఆగవు.
- మిషా, ధన్య, విష్ణు ప్రియ.. ఈ మూడు క్యారెక్టర్స్ సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి.
హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ గురించి?
- హర్షవర్ధన్ రామేశ్వర గారి మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది.
- తను కథ విన్నప్పుడే చాలా చాలెంజ్‌గా తీసుకున్నారు.
- ఆయన మ్యూజిక్‌కి చాలా మంచి మార్క్స్ పడతాయి.
మీకేమైనా డ్రీమ్ క్యారెక్టర్స్ ఉన్నాయా?
- నాకు ఇష్టమైన సినిమా ‘నాయకుడు’. ఎన్నోసార్లు ఆ సినిమాని చూశాను.
- అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఉంది.
మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి?
- నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ వర్క్ ఇవ్వడం ఇష్టం.
- ఆడియన్స్ నాకు చాలా ప్రేమ ఇచ్చారు.
- వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ లాగా చూసుకున్నారు.
- వాళ్ళకి క్వాలిటీ కంటెంట్‌నే ఇవ్వాలి.
- అందుకే చాలా మంచి కథలతోనే సినిమాలు చేయాలని ఉంది.
- నా నెక్స్ట్ ప్రాజెక్టు కి ఇంత గ్యాప్ ఉండదు. అది తొందరలోనే వస్తుంది. అలాగే ది 100 సినిమాకి సీక్వెల్ చేసే ఛాన్స్ కూడా ఉంది.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























