8 వసంతాలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్

8 vasanatalu to stream on netflix from july 11

మ్యాడ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ యువ నటి అనంతిక సనిల్ కుమార్. ఇక ఈసినిమా తరువాత అనంతిక లీడ్ రోల్ నటించిన సినిమా 8 వసంతాలు.మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఈసినిమా గత నెల 20న థియేటర్లలోకి రాగ డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది.అయితే కుబేరకు పోటీ గా రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా 21రోజులకే ఓటీటీ లోకి వస్తుంది. నెట్ ఫ్లిక్స్ దక్షిణాది భాషలకు గాను ఈ హక్కులను దక్కించుకోగా ఈనెల 11నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది. మరి థియేటర్లలో నిరాశ పరిచిన ఈసినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.అయితే 8 వసంతాలు థియేట్రికల్ రన్ అంతంతమాత్రంగానే వున్నా నిర్మాతలు విడుదలకు ముందే సేఫ్ అయిపోయారు.నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా నష్టాల నుండి తప్పించుకున్నారు.

అందమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈసినిమాలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల,సంజన కన్నా,స్వరాజ్ రెబ్బాప్రగడ,సమీరా కిషోర్ కీలక పాత్రల్లోనటించగా హెషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.