హరిహర వీరమల్లు ట్రైలర్‌పై చిరంజీవి, రామ్ చరణ్ ప్రశంసలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానపాత్రలో నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. జూలై 24వ తేదీన థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగావుంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచిన మేకర్స్.. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చాలాయేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో మెగా అభిమానులు వీరమల్లు ట్రైలర్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు ట్రైలర్‌పై పవన్ కళ్యాణ్ సోదరుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు వారు తాజాగా ట్రైలర్ వీక్షించిన అనంతరం సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ నటనను కొనియాడారు.

యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ, క్రిష్ డైరెక్షన్‌లో హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.