సినిమాకు సినిమాకు మినిమమ్ గ్యాప్ తీసుకోకుండా వరుస గా సినిమాలు చేస్తూ అత్యంత బిజీ గా వున్న హీరో ఎవరంటే సౌత్ స్టార్ ధనుష్. రీసెంట్ గానే కుబేర పూర్తి చేయగా అది విడుదలై సూపర్ హిట్ కూడా అయ్యింది. అయితే ధనుష్ ఈ సక్సెస్ ను కూడా ఎంజాయ్ చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.కుబేర రిలీజ్ తరువాత వెంటనే హిందీ సినిమా తేరే ఇష్క్ మే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక నిన్నటి తో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. చాలా తక్కువ రోజుల్లోనే ఈసినిమాను ఫినిష్ చేశాడు ధనుష్.ఇందులో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ధనుష్ , ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.ఇంతకుముందు వీరి కాంబోలో రాం ఝానా ,అత్రంగీ రే సినిమాలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తేరే ఇష్క్ మే కంప్లీట్ కావడంతో చెన్నై వచ్చి ధనుష్ ,ఇడ్లి కడై పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు.కుబేర తరువాత ధనుష్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఇదే. ఇడ్లి కడైలో నటించడమే కాదు తనే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా అరుణ్ విజయ్ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అక్టోబర్ 1న విడుదలకానుంది.
ఇక నెక్స్ట్ ధనుష్, విగ్నేష్ రాజా డైరెక్షన్ లో నటించనున్నాడు.జులై మూడో వారంలో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈసినిమాలే కాకుండా ధనుష్ చేతిలో ప్రస్తుతం మరో 8 సినిమాలు వున్నాయి.ఇందులో అబ్దుల్ కలాం ,ఇళయరాజా బయోపిక్ లు కూడా వున్నాయి.తర్వలోనే ఈసినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.మొత్తానికి మరో రెండేళ్ల వరకు ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వుండనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























