నేడే దిల్ రాజు డ్రీమ్స్ గ్రాండ్ లాంచ్.. హాజరుకానున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda To Grace The Grand Launch of Dil Raju Dreams Today

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ (TFDC) ఛైర్మన్‌, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా పరిశ్రమకు సరికొత్త సాంకేతిక హంగులు అద్దేందుకు గొప్ప ముందడుగు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కొన్నిరోజులక్రితం క్వాంటమ్ భాగస్వామ్యంతో ‘లోర్వెన్ AI’ అనే సరికొత్త స్టూడియోను హైదరాబాద్ కేంద్రంగా లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో దిల్ రాజు తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. దీనిద్వారా ఔత్సాహిక నటీనటులను, దర్శకులను మరియు టెక్నిషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇదివరకే దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేసింది.

ఈ నేపథ్యంలో నేడు దిల్ రాజు డ్రీమ్స్ ప్లాట్‌ఫామ్‌ గ్రాండ్ లాంచ్ కానుంది. ఈ కార్యక్రమానికి ట్యాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు. దిల్ రాజు బ్యానర్‌లో ఇంతకుముందు ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటించిన విజయ్ త్వరలో మరో సినిమా చేయనున్నారు. ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక దిల్ రాజు డ్రీమ్స్ ప్లాట్‌ఫామ్‌ విషయానికొస్తే, నేటినుంచి ఇది యాక్టివ్ కానున్నట్టు దిల్ రాజు బృందం తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/ లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేస్తే, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది. దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా యువ ప్రతిభావంతులు తమ ఆలోచనలను ఈ బృందం దృష్టికి తీసుకెళ్లవచ్చు. వారి ప్రొఫైల్స్ సిద్ధమైన తర్వాత స్క్రీనింగ్ చేసి అర్హత కలిగినవారికి తమ సంస్థ తీయబోయే సినిమాలలో అవకాశం కల్పించనున్నారు.

కాగా దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థపై ఇప్పటికే ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు, నిర్మిస్తున్నారు. మరోవైపు ఆయన వారసులు హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ అనే మరో బ్యానర్‌ను స్థాపించి కంటెంట్ బేస్డ్ మూవీస్ నిర్మిస్తున్నారు. 100కి పైగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న ‘బలగం’ సినిమా ఈ బ్యానర్‌పై నిర్మించినదే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.