ప్రముఖ సంస్థ చేతికి ‘జూనియర్’ నైజాం రైట్స్

Mythri Movie Distributors To Release Junior in Nizam

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే కన్నడ సినిమా ఐకాన్, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైననర్‌గా రూపొందుతున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘లెట్స్ లివ్ దిస్ మోమెంట్’ మరియు తాజాగా టీజర్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది చిత్ర బృందం. నైజాంలో జూనియర్ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనున్నట్టు తెలిపింది.

కాగా ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. రవీందర్ ప్రొడక్షన్ డిజైన్, ఇండియా టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ హై-ఆక్టేన్ యాక్షన్, నిరంజన్ దేవరమనే ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్న ‘జూనియర్’ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.