హీరో సిద్ధార్థ్ 40వ మూవీ ‘3 BHK’. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. డైరెక్టర్ శ్రీ గణేష్, ప్రొడ్యూసర్ విశ్వ గారికి థాంక్యూ. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న శశి గారికి థాంక్యూ. సిద్దు, దేవయాని, చైత్ర అందరితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా రియల్ లైఫ్‌కి చాలా కనెక్ట్ అయ్యే సినిమా. మనందరం కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇల్లు అనేది అందరి కల. ఈ సినిమాతో చాలా రిలేట్ అవుతున్నాను.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇల్లు కట్టాలని అందరికీ యాంబిషన్ ఉంటుంది. ఇల్లు అనేది ఒక గౌరవం. ఈ సినిమాని ఒక ఫ్యామిలీ లానే వర్క్ చేసాం. చాలా మంచి వర్క్ చేసాం. అది ఎలా ఉందో మీరే చెప్పాలి. ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చుని చూడదగ్గ సినిమా ఇది. ఈ సినిమాలో యాక్టర్లు కాదు క్యారెక్టర్లే కనిపిస్తాయి. తప్పకుండా ఈ సినిమా చూసి మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























