కింగ్‌డమ్ సెకండ్ సింగిల్ అప్‌డేట్

Kingdom Second Single Update

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. జూలై 31న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ ‘హృదయం లోపల’ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా కీలక అప్‌డేట్ అందించారు. కింగ్‌డమ్ సినిమా నుండి త్వరలో సెకండ్ సింగిల్ రానున్నట్టు తెలిపారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ సింగిల్‌ మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేసిన నేపథ్యంలో త్వరలో రానున్న రెండో పాటపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.