ఉప్పు కప్పురంబు ట్రైలర్ రిలీజ్

Uppu Kappurambu trailer out now

ఐ.వి. శశి దర్శకత్వంలో కీర్తి సురేష్,సుహాస్ నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు. కామెడీ డ్రామాగా వస్తుంది ఇక ఈసినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ గా ఓటిటి లోకి రానుంది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఈసినిమాను వచ్చే నెల 4 నుండి తెలుగు తోపాటు కన్నడ , మలయాళ ,తమిళ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.ఇక ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను లాంఛ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1990 ప్రారంభములో సెట్ చేయబడిన ఈ చిత్ర కథ, చిట్టి జయపురం అనే పల్లెటూరిలో ప్రారంభం అవుతుంది.ఈ పల్లెటూరు ఒక చిత్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది: ఈ ఊరిలో మరణించినవారిని పూడ్చిపెట్టటానికి చోటు లేదు. కొత్తగా నియమించబడిన,ఆదర్శవంతురాలైన గ్రామాధికారి, అపూర్వ (కీర్తి సురేష్) పదవి చేపట్టినప్పుడు ఒక మహిళ అధికారంలో ఉండడం జీర్ణించుకోలేని స్థానికులు ఆమెను అపహాస్యం చేస్తూ ఉంటారు. సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించుకున్న ఆమె, ఆ ఊరి కాటికాపరి అయిన చిన్నా (సుహాస్) సహాయం కోరుతుంది.కానీ వీరి ఉద్దేశాలు ఊరిలో గందరగోళాన్ని రేకెత్తిస్తాయి.ఆ తరువాత ఏం మైంది ఇది ఉప్పుకప్పు రంబు కథ.ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.

ఇక ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో కీర్తి సురేష్ మాట్లాడుతూ… అపూర్వ అనేది ఒక భిన్నమైన పాత్ర. ఆమె ఆదర్శవాది, దృఢనిశ్చయం కలిగినది, మరియు అవగాహన లేనిది. ఆమె పాత్రలో నటించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.ముఖ్యంగా గ్రామీణ సంస్కృతుల నేపథ్యంలో ఒక గంభీరమైన సమస్యను ప్రజల దృష్టిలోకి తీసుకొని రావటానికి ఈ చిత్రం హాస్యాన్ని మరియు ప్రాంతీయ అభిరుచులను ఉపయోగిస్తుంది, దీంతో ఇది అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది.ఇది కూడా నన్ను బాగా కదిలించింది అలాగే ప్రేక్షకులు ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడాలని నేను ఎదురుచూస్తున్నాను.

చిన్నా పాత్ర ఇదివరకు నేను చేసిన పాత్రల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది అని సుహాస్ అన్నారు. ఇతను ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కుంటాడు. ఈ చిత్రం యొక్క సారాన్ని, దీని చమత్కారమైన, భావోద్వేగమైన మరియు ఆశ్చర్యాలను ట్రైలర్ చాలా చక్కగా చూపింది. ఉప్పు కప్పురంబులో నాకు బాగా నచ్చింది, ఇది నీతులు చెప్పేదిగా ఉండదు. ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులు ఈసినిమా చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.