మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన కొత్త చిత్రం #RT76 (వర్కింగ్ టైటిల్)తో మరోసారి తన సిగ్నేచర్ ఎనర్జీతో అలరించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల పూజా వేడుకతో ప్రారంభమైయింది. ప్రేక్షకులను ఆకట్టుకునే హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో చిత్రాలను అందించే SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న #RT76 హ్యుమర్, ఎమోషన్స్‌తో కూడిన హోల్సమ్ ఎంటర్టైనర్గా వుండబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం అఫీషియల్‌గా సెట్స్ పైకి వెళ్ళింది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ జరుగుతోంది. రవితేజ, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల, రవితేజ ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌తో కూడిన ఫుల్ లెంత్ ఫ్యామిలీ డ్రామాని రాశారు. కాగా రవితేజ ఈ సినిమా కోసం చాలా స్టైలిష్‌గా మేకోవర్ అయ్యారు.
ఇక ఈ సినిమా కోసం టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ధమాకా చిత్రానికి బ్లాక్‌బస్టర్ సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కోసం రవితేజతో కలిసి పని చేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. కాగా #RT76 2026 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























