ఆరోజే ఎయిర్‌ ఇండియా ఫైట్‌లో లండన్‌కు వెళ్ళా – మంచు లక్ష్మి

Actress Manchu Lakshmi Post Goes Viral on Ahmedabad Plane Crash

రెండురోజుల క్రిందట గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎయిర్‌ ఇండియాకి చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఫ్లైట్ మధ్యాహ్నం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఇది విమానాశ్రయం సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ లోని చెట్లు, బిల్డింగులను ఢీకొని కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మందితోపాటు నివాసప్రాంతాల్లోని మరో 33 మంది సహా మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ఘోర ప్రమాదంపై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఈ ప్రమాదం నుంచి లక్కీగా తప్పించుకున్నట్టు తెలిసింది. విమానం కూలిపోయిన రోజున మంచు లక్ష్మి కూడా ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లోనే లండన్‌కు ప్రయాణించారు. అయితే, ఆమె ముంబై నుంచి వెళ్లే ఫ్లైట్‌ ఎక్కడంతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఎక్స్‌ వేదికగా తెలిపారు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని ఆమె తెలిపారు.

ఈ మేరకు మంచు లక్ష్మి ఎక్స్‌లో.. “అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, ఇది నిజంగా బాధాకరమైనది. ఈ విషాదంలో ఇంకా ఎక్కువ మంది రెసిడెంట్ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు విన్నప్పుడు నా గుండె బద్దలైపోయింది. నేను ఈరోజు ఎయిర్ ఇండియాలో లండన్‌కు వెళ్లానని నమ్మలేకపోతున్నాను దేవుడు గొప్పవాడు. ఈ రోజు బాధపడ్డ అన్ని కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.

ఇంకా ఆమె ఇలా తెలిపారు.. “ఇక ఈ ప్రమాదంలో నాకు ఏదైనా జరిగిందా అని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్‌లు పెడుతున్నారు. అయితే, ప్రమాదం జరిగిన రోజు నేను ముంబై నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో ప్రయాణించాను. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. నాపై అభిమానం చూపించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.