ఓటీటీ లోకి వచ్చేసిన బ్లైండ్ స్పాట్.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Naveen Chandra's Blind Spot Now Streaming on OTT

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నూతన దర్శకుడు రాకేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటించగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పెడదా, హర్ష రోషన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలకు ముందే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి.ఈ నేపథ్యంలో అంచనాల నడుమ బ్లైండ్ స్పాట్ చిత్రం మే 9న థియేటర్లలో విడుదలయింది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడే ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఇన్వెస్టిగేషన్ తీరుని దర్శకుడు ఆసక్తికరంగా మలచడంతో థియేటర్ లో ప్రేక్షకుడికి మంచి థ్రిల్ అందించింది సినిమా.

ఇక తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లనే కళ్లజూసింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో తిలకించేందుకు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నేడు బ్లైండ్ స్పాట్ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంట్రీ ఇచ్చేసింది. కాగా ఈ సినిమాకి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందించగా.. దర్శన్ ఎమ్ అంబట్ సినిమాటోగ్రఫీ, సత్య. జి ఎడిటింగ్ నిర్వహించారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేసింది.

బ్లైండ్ స్పాట్ కథ ఏంటంటే?

జయరామ్ (రవివర్మ), దివ్య (రాశి సింగ్) భార్యాభర్తలు. ఈ దంపతులకు ఒక చిన్న పాప ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య సఖ్యత ఉండదు. వీరి ఇంట్లో లక్ష్మి (గాయత్రీ భార్గవి) పనిమనిషిగా చేస్తుంటుంది. ఒకరోజు రాత్రి అనూహ్యంగా దివ్య తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కి వేలాడుతూ చనిపోయి కనిపిస్తుంది. దీంతో షాక్ అయిన లక్ష్మి పోలీసులకు సమాచారం అందిస్తుంది.

ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీస్ ఆఫీసర్ విక్రమ్ (నవీన్ చంద్ర) ఒక కానిస్టేబుల్‌తో కలిసి అక్కడికి వస్తాడు. వచ్చిరాగానే ఇంటినంతా పరిశీలించి అది ఆత్మహత్య కాదు, హత్య అని తేలుస్తాడు. ఈ తరుణంలో దివ్య భర్త సహా ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ప్రతి ఒక్కరినీ విచారిస్తాడు. ఈ క్రమంలో ప్రతిసారీ ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటాడు.

అయితే దివ్య మృతి చెందడానికి కారణం ఏంటి? ఇంతకూ ఆమెది ఆత్మహత్యా? లేదంటే విక్రమ్ అనుమానిస్తున్నట్టు అది హత్యా? ఒకవేళ ఆమెది హత్యే అయితే ఎవరు చేశారు? దీనివెనుక ఎవరున్నారు? ఎందుకు ఆమెను చంపాల్సి వచ్చింది? ఆదిత్య (అలీ రెజా), మానస (హారిక పేడాడ), రాంబాబు (కిషోర్ కుమార్), వినోద్ (అభిషిక్త్) వీరంతా ఎవరు? వీరికి దివ్యకి సంబంధం ఏంటి? చివరికి విక్రమ్ ఏం కనిపెట్టాడు? అన్నదే మిగతా కథ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.